News April 1, 2024

నేడు కదిరిలో పర్యటించనున్న సీఎం జగన్

image

కదిరిలో సోమవారం సీఎం జగన్ పర్యటించనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా
నేటి సాయంత్రం పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ముస్లి సోదరులు పాల్గొనాలని కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ కోరారు. అనంతరం పార్టీలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాష జగన్ సమక్షంలో చేరనున్నారు.

Similar News

News March 16, 2026

వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్‌లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.

News March 16, 2026

అందరికీ ధన్యవాదాల: అనంత కలెక్టర్

image

గుత్తి పట్టణంలో తొలిసారిగా రెండు రోజులపాటు నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో కార్యక్రమాలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

News March 16, 2026

114 అర్జీలను స్వీకరించాం: అనంత ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 114 పిటీషన్లు స్వీకరించినట్లు ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. పిటీషనర్లతో ముఖాముఖి మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పిటీషనర్లు, వీరి వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఇస్కాన్ సహకారంతో ఉచిత భోజన సదుపాయం కల్పించామన్నారు.