News August 17, 2025
నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక భేటీ

బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ ఉదయం 9.30 గంటలకు కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడింది. అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతలను ఎన్డీఏ వర్గాలు ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి. నామినేషన్ దాఖలుకు సమయం సమీపిస్తుండటంతో ఇవాళ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు.
Similar News
News August 17, 2025
‘గీతాంజలి’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?

నాగార్జున కెరీర్‌లో ‘గీతాంజలి’ (1989) ఓ క్లాసిక్. మణిరత్నం తెరకెక్కించిన ఆ చిత్రంలో గిరిజ హీరోయిన్. తాజాగా జగపతి బాబు హోస్ట్ చేసిన ఓ షోలో ఆ సినిమా విశేషాలను ఆమె పంచుకున్నారు. ‘నాకు అది తొలి సినిమా. నాగార్జునకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సౌమ్యుడు. అతడు లెజెండ్‌కు తక్కువేం కాదు. నా ఫస్ట్ మూవీలో సహ నటుడిగా ఉన్నందుకు థాంక్యూ’ అని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఆమె స్క్రీన్‌పై కనిపించడంతో ఫొటో వైరలవుతోంది.
News August 17, 2025
నేను రాజకీయాల్లోకి రాను: పాక్ ఆర్మీ చీఫ్

తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘నన్ను దేవుడు పాక్ రక్షకుడిగా పంపాడు. నేను సైనికుడిని. ఇలాగే ఉంటా. దేశం కోసం ఆత్మబలిదానానికైనా సిద్ధం. రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదు. పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం లేదు’ అని చెప్పారు. అమెరికా, చైనా రెండూ తమ మిత్ర దేశాలేనని.. ఒక ఫ్రెండ్ కోసం మరొకరిని వదులుకోలేమని తేల్చి చెప్పారు.
News August 17, 2025
56 రోజుల్లో 261 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ 20 నుంచి నిన్నటి వరకు పలు ఘటనల్లో 261 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వరదలు, కొండచరియలు విరిగి పడటం, ఇతర వర్ష సంబంధిత ఘటనల్లో 136 మంది మరణించగా, 125 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారని పేర్కొంది. సుమారుగా రూ.2 లక్షల కోట్లకు పైగా ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది.