News August 17, 2025
సంగారెడ్డి: 20 నుంచి మండల స్థాయి పోటీలు: డీఈఓ

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి పది రోజుల పాటు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో ఖోఖో, వాలీబాల్, కబడ్డీ మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
Similar News
News August 17, 2025
కృష్ణా: ఆధునిక యుగంలోనూ తావీజ్ ప్రభావం

ఆధునిక వైద్యం, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రజలలో కొన్ని పాతకాలపు నమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే తావీజ్ కేంద్రాలు. తావీజ్ ధరించడం వల్ల నిజంగా ఫలితం ఉంటుందా, లేదా అనేది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కానీ ఇది ప్రజల్లో ఒక రకమైన మానసిక బలం, ధైర్యం ఇస్తుందనేది వాస్తవం. అందుకే ఇప్పటికీ గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా తావీజ్ ధరించేవారి సంఖ్య తగ్గడం లేదు. మీ కామెంట్.
News August 17, 2025
పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ కాదు: ప్రకాశ్ రాజ్

మహిళల ప్రైవసీ కారణంగా CCTV ఫుటేజీ ఇవ్వలేమన్న EC <<17435042>>ప్రకటనపై<<>> సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ‘మీరు పోలింగ్ కేంద్రాల్లో CCTVలు పెట్టే ముందు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ కాదు. మీరు చెప్పే సాకులపై మాకు ఆసక్తి లేదు. పారదర్శకత కావాలి’ అని Xలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని, పోలింగ్ CCTV ఫుటేజ్‌లను బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
News August 17, 2025
HYD: OUలో 84వ స్నాతకోత్సవం..121 గోల్డ్ మెడల్స్ ప్రదానం

ఓయూ 84వ స్నాతకోత్సవం ఈనెల 19న ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్నాతకోత్సవంలో
✒121 బంగారు పతకాలు
✒పీహెచ్డీ పూర్తి చేసిన 1261 మంది విద్యార్థులకు పట్టాలు
✒108 ఏళ్ల OU చరిత్రలో మొట్ట మొదటి సారిగా గౌరవ కులపతి, రాష్ట్ర గవర్నర్ పేరుతో గిరిజన విద్యార్థులకు ఆంగ్లంలో పీహెచ్డీ డిగ్రీకి బంగారు పతకం
✒ఈ ఏడాది నుంచి ఎంబీఏ ఫైనాన్స్‌లో ప్రొఫెసర్ సముద్రాల సత్యనారాయణ మూర్తి స్మారక బంగారు పతకం అందిస్తున్నారు.