News August 17, 2025
సంగారెడ్డి: అడ్మిషన్లకు రేపే చివరి తేదీ

ఓపెన్ విధానంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు ఈనెల18 చివరి తేదీ అని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట స్వామి ఆదివారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అధ్యయన కేంద్రాల్లో అర్హులైన వారు అడ్మిషన్ పొందాలని చెప్పారు. మీ-సేవ కేంద్రాల్లో మాత్రమే ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News August 18, 2025
KMR: కళకళలాడుతున్న ప్రాజెక్టులు

కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో నిండుగా ఉంది. కళ్యాణి ప్రాజెక్టు ఒక గేటు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. కౌలాస్ నాలా, సింగీతం రిజర్వాయర్‌లలోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. జిల్లాలోని ప్రాజెక్టులు జలకళతో కళకళలాడుతున్నాయి.
News August 18, 2025
శుభ్‌మన్ గిల్‌కు BCCI బిగ్ షాక్?

ఆసియా కప్ 2025 కోసం BCCI ప్రకటించే భారత జట్టులో టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు కల్పించడం లేదని తెలుస్తోంది. టీ20 ప్రణాళికల్లో ఆయన లేకపోవడమే ఇందుకు కారణమని టాక్. అతడికి బదులు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసి వైస్ కెప్టెన్సీ అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. టీమ్ ఇండియా ప్లేయర్లలో అందరికంటే తక్కువ స్ట్రైక్ రేట్ ఉండటం కూడా గిల్‌ను పక్కన పెట్టేందుకు మరో కారణమని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
News August 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 18, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.44 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.00 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.47 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.40 గంటలకు
✒ ఇష: రాత్రి 7.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.