News August 17, 2025
చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

APలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గతవారంతో పోలిస్తే పెరిగాయి. గతవారం కిలో రూ.220-రూ.230 వరకు అమ్మకాలు జరిగాయి. ఇవాళ పల్నాడులో కిలో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.240-రూ.250, గుంటూరు, చిత్తూరులో రూ.200 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. అటు హైదరాబాద్‌లో రూ.190- రూ.210, వరంగల్‌లో రూ.200, ఖమ్మంలో రూ.210 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
Similar News
News August 17, 2025
జూబ్లీహిల్స్ టికెట్ వేటలో అజారుద్దీన్

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో MLA టికెట్ కోసం మాజీ MP అజారుద్దీన్ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. గతంలో PCC వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన సమయంలో గాంధీభవన్‌కు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు టికెట్ ఆశతో ప్రతి సమావేశానికి హాజరవుతున్నారు. ఇటీవల ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకతోనూ భేటీ అయ్యారు. మరోవైపు నవీన్ యాదవ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
News August 17, 2025
‘గీతాంజలి’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?

నాగార్జున కెరీర్‌లో ‘గీతాంజలి’ (1989) ఓ క్లాసిక్. మణిరత్నం తెరకెక్కించిన ఆ చిత్రంలో గిరిజ హీరోయిన్. తాజాగా జగపతి బాబు హోస్ట్ చేసిన ఓ షోలో ఆ సినిమా విశేషాలను ఆమె పంచుకున్నారు. ‘నాకు అది తొలి సినిమా. నాగార్జునకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సౌమ్యుడు. అతడు లెజెండ్‌కు తక్కువేం కాదు. నా ఫస్ట్ మూవీలో సహ నటుడిగా ఉన్నందుకు థాంక్యూ’ అని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఆమె స్క్రీన్‌పై కనిపించడంతో ఫొటో వైరలవుతోంది.
News August 17, 2025
నేను రాజకీయాల్లోకి రాను: పాక్ ఆర్మీ చీఫ్

తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘నన్ను దేవుడు పాక్ రక్షకుడిగా పంపాడు. నేను సైనికుడిని. ఇలాగే ఉంటా. దేశం కోసం ఆత్మబలిదానానికైనా సిద్ధం. రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదు. పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం లేదు’ అని చెప్పారు. అమెరికా, చైనా రెండూ తమ మిత్ర దేశాలేనని.. ఒక ఫ్రెండ్ కోసం మరొకరిని వదులుకోలేమని తేల్చి చెప్పారు.