News August 17, 2025
టెక్కలి: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. తప్పిన ప్రమాదం

టెక్కలి – మెలియాపుట్టి రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం వేకువజామున డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న AP39 UU 7060 నంబరు లారీ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 1033 హైవే అంబులెన్స్
ద్వారా అతన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News August 18, 2025
SKLM: 19, 20 తేదీల్లో జోనల్ స్థాయి క్రీడా పోటీలు

19, 20 తేదీల్లో విశాఖలోని జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. శ్రీధర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి ఇప్పటికే సమాచారం అందించామన్నారు. వారందరూ శ్రీకాకుళం కోడి రామమూర్తి మున్సిపల్ స్టేడియంకు 19న ఉదయం 5 గంటలకు హాజరు కావాలన్నారు. పూర్తి సమాచారానికి 98850 96734 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News August 18, 2025
SKLM: ‘తుఫాన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు’

శ్రీకాకుళం జిల్లాలోని ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో తుఫాన్ అలర్ట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19 వరకు అధికారులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని తెలియజేశారు. నిత్యావసర వస్తువులు నిల్వలు ఉంచాలని సూచించారు.
News August 18, 2025
SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.