News August 17, 2025

నాగావళి నదిలో స్నానానికి దిగి మృతి

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం ఉదయం విషాదం నెలకొంది. పాలకొండ మండలం అన్నవరంలో బంధువుల ఇంటికి వచ్చిన పవన్ (16) నాగావళి నదిలో స్నానానికి దిగి మృతి చెందాడు. మృతి చెందిన పవన్ ఆమదాలవలస మండలం వజ్రగూడ గ్రామానికి చెందినవాడు. సెలవులకు బంధువుల ఇంటికి వచ్చి మృతి చెందడంతో ఇటు అన్నవరంలోనూ అటు వజ్రగూడ గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.

Similar News

News August 18, 2025

సినిమా ఛాన్స్‌ల కోసం మణిరత్నం వెంటపడ్డా: నాగార్జున

image

కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించే కథలకు తాను సరిపోతానని భావించి ఆయన వెంటపడేవాడినని సినీ నటుడు నాగార్జున తెలిపారు. అలా మా కాంబోలో వచ్చిందే ‘గీతాంజలి’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నాగేశ్వరరావు కొడుకుగానే తొలి ఆరేడు సినిమాలు చేశా. ఇది కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. మజ్ను సినిమా నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆఖరి పోరాటంతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నా’ అని నాగ్ చెప్పుకొచ్చారు.

News August 18, 2025

DEECET స్పాట్ అడ్మిషన్స్.. ఈ నెల 21వ తేదీ లాస్ట్

image

ఉమ్మడి MBNR జిల్లాలో DEECET-2025లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు మహమ్మద్ మేరాజుల్లాఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా DEECETలో అర్హత సాధించి ఉండాలని, అలాగే ఏ కళాశాలలోనూ సీటు పొంది ఉండకూడదన్నారు. అడ్మిషన్ల గడువు ఈ నెల 21 అని ఆయన తెలిపారు.

News August 18, 2025

ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్

image

ఒడిశా మాజీ సీఎం, BJD నేత నవీన్ పట్నాయక్ (78) ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం నవీన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా నవీన్ ఇటీవల ముంబైలో సర్వికల్ ఆర్థరైటిస్‌కు సర్జరీ చేయించుకున్నారు.