News April 1, 2024
అలంపూర్: త్రైమాసిక ఆదాయం రూ.2.62కోట్లు

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలకు వచ్చిన త్రైమాసిక ఆదాయం రూ.2,62,58,346 సమకూరిందని ఆలయ ఈఓ పురేంద్ర కుమార్ తెలిపారు. 2024 సంవత్సరంలో ఆదాయం బాగా పెరిగిందన్నారు. ఉచిత బస్సుల ప్రయాణం కారణంగా భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. వివిధ ఆర్జిత సేవ హుండి అన్నదానం ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు.
Similar News
News January 23, 2026
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 11 మంది సీఐల బదిలీ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో పని చేస్తున్న 11 మంది సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 అదనపు డీజీపీ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ట్రాఫిక్ సీఐగా ఉన్న భగవంత రెడ్డిని మరికల్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు తక్షణమే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.
News January 23, 2026
MBNR: MVSలో ఉద్యోగమేళా..164 మంది ఎంపిక

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఉద్యోగమేళా నిర్వహించారు. ఇందులో 164 మంది విద్యార్థులు 18 కంపెనీలలో ఉద్యోగ అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను ప్రిన్సిపల్ డా.కె. పద్మావతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లేస్ మెంట్ కో ఆర్డినేటర్ సూర్యనారాయణ, అకాడమిక్ కో ఆర్డినేటర్ రవీందర్, టీఎస్ కేసీ మెంటర్ తేజస్విని, అధ్యాపకులు పాల్గొన్నారు.
News January 22, 2026
MBNR: సంక్రాంతి ఆదాయంలో ఆర్టీసీ రికార్డు.. రాష్ట్రంలోనే టాప్.!

సంక్రాంతి పండుగ వేళ MBNR ఆర్టీసీ రీజియన్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 794 ప్రత్యేక బస్సులతో 39.20 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేసి ₹22.70 కోట్ల ఆదాయం సాధించినట్లు RM సంతోష్ కుమార్ తెలిపారు. 109% ఆక్యూపెన్సీ రేషియోతో తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. సుమారు 34.48 లక్షల కి.మీటర్లు బస్సులు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు.


