News August 17, 2025

గద్వాల్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కర్ణాటక రాష్ట్రం సైదాపూర్ వద్ద నిన్న ఘోర రోడ్డు చోటుచేసుకుంది. గట్టు మండలం మాచర్లకు చెందిన పీజీ రాఘవేంద్ర(42), ఆయన బంధువు నాగేశ్(50) మృతి చెందారు. రాఘవేంద్ర గద్వాల్ చీరలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. వ్యాపారం అనంతరం పుణే నుంచి అక్కబావలతో కలిసి కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. సైదపూర్ వద్ద కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో మసుమన్న, ఈరమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News August 18, 2025

భార్యాభర్తల గొడవ.. నీల్వాయి SI సస్పెండ్

image

వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ SI సురేశ్ సస్పెండ్ అయ్యారు. CP అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు విడుదల చేశారు. సంపుటం గ్రామానికి చెందిన భార్యాభర్తల గొడవ విషయంలో కౌన్సెలింగ్ పేరిట స్టేషన్‌కు పిలిపించారు. తనను SI చితకబాదారని భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు SI సురేశ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. గత నెల 19న వీధుల్లో చేరి నెల రోజులు గడవకముందే సస్పెండ్ అయ్యారు.

News August 18, 2025

వరంగల్: ప్రియుడితో కలిసి వెళ్తుంటే పోలీసులకు దొరికి..?

image

ప్రియుడితో కలిసి వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డ ఘటన వరంగల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పద్మ అనే మహిళ చిట్టీలను నడుపుతూ జమ్మికుంటకు చెందిన సందీప్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరి వివాహేతర సంబంధానికి పద్మ భర్త రాజు అడ్డుతొలగాలని ఈనెల 14న తన స్నేహితులతో రామన్నపేట డంపింగ్ యార్డులో గొంతు నులిమి హత్యాయత్నానికి పాల్పడ్డారు. రూ.9లక్షలతో వెళ్తుండగా పట్టుబడ్డారు.

News August 18, 2025

నాగల్‌గిద్ద: పెన్షన్ కోసం ఎదురు చూపు

image

నాగల్‌గిద్ద మండలంలోని శేరిధామస్‌గిద్దకు చెందిన తుర్రురాజు మూడేళ్ల నుంచి నడవలేని స్థితిలో ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం కాలుకి గాయం కావడంతో వైద్యులు అతని రెండు కళ్లు తొడ వరకు తొలగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెన్షన్ కోసం ఎన్ని సార్లు సదరం క్యాంప్‌నకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వేడుకుంటున్నాడు. అధికారులు స్పందించి పెన్షన్ మంజురు చేయాలని బాధితుడు కోరుతున్నాడు.