News April 1, 2024
రాజోలు: 578 ఓట్ల తేడాతో MLA అయ్యాడు!

రాజోలులో 1952-2019 వరకు 15సార్లు ఎన్నికలు జరిగితే.. 3సార్లు అతి తక్కువ ఓట్ల తేడాతో MLA పీఠం దక్కించుకున్నారు. 1989లో ఎం.గంగయ్య(కాంగ్రెస్‘ఐ’) AVS నారాయణరాజు(TDP)పై 611 ఓట్ల తేడాతో గెలవగా.. 1999లో AVS నారాయణరాజు(TDP) ఏ.కృష్ణంరాజు(కాంగ్రెస్‘ఐ’)పై 578 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జనసేన నుంచి బరిలో దిగిన రాపాక బి.రాజేశ్వరరావు(వైసీపీ)పై 814 ఓట్ల తేడాతో గెలిచినా.. ఆయన తర్వాత వైసీపీలో చేరారు.
Similar News
News September 30, 2025
ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రాధాన్యత: కలెక్టర్

అక్టోబర్ 4,5 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో బ్రెజిల్ ప్రతినిధుల బృందం పర్యటించనుందని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. ఈ పర్యటన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రాధాన్యతను తెచ్చిపెడుతుందన్నారు. బ్రెజిల్ COP–30 ఆతిథ్యం, భారతదేశ G20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ఇది ప్రత్యేకంగా నిలవనుంది. బ్రెజిల్ బృందానికి శ్రీమతి వివియన్ లిబోరియో డి అల్మెయిడా నాయకత్వం వహిస్తారని కలెక్టర్ వివరించారు.
News September 30, 2025
తూ.గో జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: కలెక్టర్

తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వచ్ఛతా హీ సేవా, స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమాల స్ఫూర్తితో, సంకల్ప దీక్షతో విజయ దశమి, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా మన ఇంటి నుంచి అన్ని ప్రదేశాలలో స్వచ్ఛత పాటించాలని సూచించారు.
News September 29, 2025
అఖండ గోదావరికి అయిదు వంతెనల హారం

రాజమండ్రి- కొవ్వూరును కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఐదు వంతెనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1975లో నిర్మించిన ఆసియాలోనే రెండో అతిపెద్దదైన రోడ్డు కమ్ రైల్వే వంతెన, బ్రిటిష్ హయాంలోని హేవలాక్ బ్రిడ్జి గోదావరికి మణిహారాలుగా ఉన్నాయి. ఆర్చ్ ఆకారపు రైలు వంతెన, 2015లో నిర్మించిన 4 లైన్ల రోడ్డు వంతెన, ధవళేశ్వరం ఆనకట్ట ఈ ఐదు అద్భుతాలు గోదావరి అందాలను ఇనుమడింపజేస్తున్నాయి.