News August 17, 2025

చికెన్ బోన్స్ తింటున్నారా?

image

చాలామంది చికెన్‌తో పాటు ఎముకలను నమిలేస్తుంటారు. బోన్స్ తింటే జీర్ణ సమస్యలు రావొచ్చని, కృత్రిమంగా పెరిగిన కోళ్ల ఎముకలతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి జీర్ణమయ్యేందుకు టైమ్ పడుతుందని, పేగులలో అడ్డంకులు ఏర్పడొచ్చని అంటున్నారు. ఎముకలు అన్నవాహిక, శ్వాసనాళంలో చిక్కుకునే అవకాశముంటుందని, శ్వాసనాళంలో ఇరుక్కుపోతే ఊపిరాడక ఇబ్బంది ఎదురవ్వొచ్చని పేర్కొంటున్నారు. SHARE IT.

Similar News

News August 17, 2025

తమిళ దర్శకులను ఇతర భాషల డైరెక్టర్లతో పోల్చొద్దు: మురుగదాస్

image

తమిళ సినిమాలు ఎందుకు రూ.1000 కోట్లు కలెక్ట్ చేయట్లేదన్న ప్రశ్నకు డైరెక్టర్ మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద సమాధానమిచ్చారు. ‘తమిళ దర్శకులను ఇతర భాషల డైరెక్టర్లతో పోల్చొద్దు. ఇతర భాషల డైరెక్టర్లు జనాల్ని ఎంటర్‌టైన్ మాత్రమే చేస్తారు. కానీ తమిళ దర్శకులు వారిని ఎడ్యుకేట్ చేస్తారు. జీవితంలో ఏం చేయాలి, ఏం చేయొద్దనేది సినిమాల ద్వారా చెబుతారు. అదే ఇండస్ట్రీల మధ్య వ్యత్యాసం’ అని పేర్కొన్నారు.

News August 17, 2025

ఇండియాకు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్

image

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. అఫ్గానిస్థాన్‌తో కలిసి తమ దేశంలో అశాంతికి కుట్ర చేస్తే దాడులు చేస్తామని బెదిరించారు. అఫ్గాన్ ప్రభుత్వం Tehrik-i-Taliban Pakistan (TTP) మిలిటెంట్లను పాక్‌లోకి పంపిస్తూ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తాము ఇంత కాలంగా అఫ్గాన్‌పై దయ చూపామని, కానీ ఇండియాతో కలిసి తమపైనే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

News August 17, 2025

అక్టోబ‌ర్ 2 నాటికి లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌లు: మంత్రి పొంగులేటి

image

TG: లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌ల‌ను అక్టోబ‌ర్ 2 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. “ఇప్ప‌టికే తొలి విడ‌త స‌ర్వేయ‌ర్ల శిక్ష‌ణ పూర్తయింది. ఈ నెల 18న రెండో విడ‌త శిక్ష‌ణ మొదలవుతుంది. భూ సమస్యల పరిష్కారం కోసం ‘భూభార‌తి’ తీసుకొచ్చాం. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాప్ త‌ప్పనిస‌రి కావడంతో లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల సేవలను నియమిస్తున్నాం” అని పేర్కొన్నారు.