News August 17, 2025

మెదక్ జిల్లాలో వర్షపాతం అప్డేట్!

image

మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా టేక్మాల్ 14.8, అత్యల్పంగా తూప్రాన్‌లోని ఇస్లాంపూర్ 0.8 మిమీ వర్షపాతం రికార్డు అయింది. అటు చిప్పల్తుర్తి(నర్సాపూర్)13.3, బుజారంపేట్(కౌడిపల్లి), శివంపేట్10.0, నర్సాపూర్ 8.0, చిట్కుల్ (చిలప్ చెడ్), మనోహరాబాద్ 4.0, నాగపూర్ (హవేలి ఘనపూర్) 4.0 మిమీ వర్షపాతం నమోదైంది.

Similar News

News August 17, 2025

పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి సమావేశం

image

పంచాయితీ రాజ్ శాఖ జిల్లా అధికారులతో మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశం నిర్వహించారు. అందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంచాయత్ రాజ్ శాఖ అధ్వర్యంలో చేపడుతున్న నూతన రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, పునర్ నిర్మాణ పనులపై సమీక్షించారు. యుద్ధ ప్రతిపాదిక పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

News August 17, 2025

మెదక్: గణేశ్ మండపాల వివరాలు ఆన్‌లైన్ తప్పనిసరి: ఎస్పీ

image

రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ మండప నిర్వాహకులు, సభ్యులు, కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ వారు రూపొందించిన వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

News August 17, 2025

ఈనెల 19న మెదక్ స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు

image

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ స్టేడియంలో ఈనెల 19న ఉ.10కు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయని అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, మధుసూదన్ తెలిపారు. అండర్ 14, 16, 18, 20 బాల బాలికలకు మూడు విభాగాల్లో రన్స్, త్రోస్, జెమ్స్‌లో ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 31న మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో జిల్లా తరఫున పాల్గొంటారు.