News April 1, 2024

అస్సాం సీఎం వ్యాఖ్యలపై బద్రుద్దీన్ కౌంటర్

image

మరోసారి పెళ్లి చేసుకోవాలని ఉంటే ఎన్నికలలోపే చేసుకోవాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలకు AIUDF చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ తీవ్రంగా స్పందించారు. ‘ఆయనకు శక్తి లేక ఒక్క బిడ్డనే కన్నారు. నాకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. నాకు మళ్లీ చేసుకోవాలని అనిపిస్తే నేను ముఖ్యమంత్రిని అడగను’ అని పేర్కొన్నారు. కాగా తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ అజ్మల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది.

Similar News

News October 6, 2024

ఇజ్రాయెల్‌ దాడిలో 26మంది మృతి: హమాస్

image

గాజాపై ఇజ్రాయెల్ చేసిన తాజా దాడిలో ఓ మసీదులో 26మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ తెలిపింది. డెయిర్ అల్-బలాలో ఉన్న ఆ మసీదులో శరణార్థులు తల దాచుకున్నారని పేర్కొంది. అనేకమంది తీవ్రగాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు ఇజ్రాయెల్ ఆ ప్రకటనను ఖండించింది. హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని తాము అత్యంత కచ్చితత్వంగా గుర్తించి ధ్వంసం చేశామని, అందులో హమాస్ కమాండ్ సెంటర్ ఉందని పేర్కొంది.

News October 6, 2024

IPL Rules: ఈ యంగ్ క్రికెటర్లు ఇక కోటీశ్వరులు!

image

మారిన IPL రిటెన్షన్ పాలసీతో యంగ్ క్రికెటర్లు రూ.కోట్లు కొల్లగొట్టబోతున్నారు. వేలానికి ముందు ఫ్రాంచైజీలు ఆరుగురిని రిటెయిన్ చేసుకోవచ్చు. ఐదుగురు క్యాప్డ్ (భారత, విదేశీ), గరిష్ఠంగా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు. బంగ్లా టీ20 సిరీసుకు మయాంక్ యాదవ్ LSG, నితీశ్ కుమార్ SRH, హర్షిత్ రాణా KKR ఎంపికయ్యారు. దీంతో వీరిని తీసుకుంటే రూ.11-18 కోట్లు ఇవ్వాల్సిందే. రింకూ సైతం కోటీశ్వరుడు అవుతారు.

News October 6, 2024

సురేఖను వివరణ కోరలేదు: టీపీసీసీ చీఫ్

image

TG: సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అధిష్ఠానం వివరణ కోరలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆయన విమర్శించారు. సురేఖ తన కామెంట్లను వెనక్కి తీసుకోవడంతోనే ఆ వివాదం ముగిసిందని చెప్పారు. కాగా సురేఖ వ్యాఖ్యలపై ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారని, ఆమెపై కఠిన చర్యలు ఉంటాయని వార్తలు వచ్చాయి.