News August 17, 2025
గంగారాం: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ఏడు బావుల జలపాతంలో ప్రేమ్ కుమార్(23) శనివారం<<17432714>> గల్లంతైన విషయం తెలిసిందే<<>>. గంగారం మండలం పందెం శివారులోని కీకారణ్యం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల అనంతరం ఆదివారం అతడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిది భద్రాద్రి జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం.
Similar News
News August 18, 2025
నేటి ముఖ్యాంశాలు

* AP: వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: CBN
* దేశానికి జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి లోకేశ్
* ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలంటూ ప్రచారం.. టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్
* TG: ఏపీలోనూ కాంగ్రెస్ బలపడుతుంది: భట్టి
* కాళేశ్వరం మోటార్లను నాశనం చేసేందుకు కుట్ర: హరీశ్
* ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా C.P.రాధాకృష్ణన్
* ‘ఓటు చోరీ’ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ
News August 18, 2025
తిరుమలలో గందరగోళం జరగలేదు: TTD

తిరుమల క్యూలో గందరగోళం జరిగినట్లు వస్తున్న వార్తలను TTD ఖండించింది. వైరల్ అవుతోన్న వీడియో తోపులాటకు సంబంధించినది కాదని స్పష్టం చేసింది. భక్తులను సమూహాలుగా విభజించి తాళ్ల సాయంతో క్రమబద్ధీకరిస్తుండగా కొందరు ఉత్సాహంతో ముందుకు కదిలారని.. దాన్ని తోపులాట అని తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది. గత 3 రోజుల్లో 2.5 లక్షల మంది ఎలాంటి అంతరాయం లేకుండా స్వామివారిని దర్శించుకున్నారని వివరించింది.
News August 18, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ జితేష్ వి పాటిల్
✓పాల్వంచ బస్టాండ్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని
✓Way2News కథనానికి స్పందన.. సారపాకలో రోడ్లకు మరమ్మతులు
✓మణుగూరులో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొట్టిన డీసీఎం
✓భద్రాద్రి రామాలయంలో అన్నదానానికి రూ.లక్ష విరాళం
✓సీపీఐ నేత అయోధ్య సంస్మరణ సభలో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే పాయం
✓పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలానికి ముప్పు: సీపీఎం