News August 17, 2025
MDK: ‘హైకోర్టు తీర్పు అమలుకు సహకరించాలి’

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని SGTU రాష్ట్రశాఖ డిమాండ్ చేసింది. ఆదివారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరాలని వినతి చేశారు. రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, కార్యదర్శి సత్యం, జిల్లా అధ్యక్షుడు జింక అశోక్, ఉపేందర్, యాదగిరి, రాము పాల్గొన్నారు.
Similar News
News August 18, 2025
మెదక్: బోనస్ డబ్బుల కోసం వేటింగ్

రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. బోనస్ నేటికీ రైతుల ఖాతాలో జమ కాలేదు. కొనుగోలు జరిపి దాదాపు 5 నెలలు గడుస్తున్నప్పటికీ బోనస్ పడకపోవడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఖాతాలో బోనస్ జమ చేయాలని వేడుకుంటున్నారు.
News August 17, 2025
పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి సమావేశం

పంచాయితీ రాజ్ శాఖ జిల్లా అధికారులతో మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశం నిర్వహించారు. అందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంచాయత్ రాజ్ శాఖ అధ్వర్యంలో చేపడుతున్న నూతన రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, పునర్ నిర్మాణ పనులపై సమీక్షించారు. యుద్ధ ప్రతిపాదిక పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
News August 17, 2025
మెదక్: గణేశ్ మండపాల వివరాలు ఆన్‌లైన్ తప్పనిసరి: ఎస్పీ

రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ మండప నిర్వాహకులు, సభ్యులు, కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ వారు రూపొందించిన వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.