News April 1, 2024
HYD: మల్లారెడ్డి VS మైనంపల్లి

మల్కాజిగిరిలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావుపై తన అల్లుడిని నిలబెట్టి మల్లారెడ్డి గెలిపించుకున్నారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను మైనంపల్లికి అధిష్ఠానం అప్పగించగా కచ్చితంగా గెలిపిస్తానన్నారు. అయితే మల్కాజిగిరిలో BRSను గెలిపిస్తానని ఇటీవల మల్లారెడ్డి అన్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News September 9, 2025
బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. పరీక్షా ఫలితాల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News September 9, 2025
పన్ను వసూళ్లకు GHMCకు కొత్త టెక్నిక్!

GHMC తన ఆస్తి పన్ను ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. TGSPDCL సహకారంతో ఆస్తి పన్ను ఐడీ నంబర్లను (PTIN) విద్యుత్ కనెక్షన్లతో (USC) అనుసంధానం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 6 GHMCలోని జోన్లలో గణనీయమైన పురోగతి సాధించింది. 96,938 నివాస ఆస్తుల పన్ను ఐడీలు విజయవంతంగా వాణిజ్య విద్యుత్ కనెక్షన్లతో అనుసంధానం అయ్యాయని అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు.
News September 9, 2025
HYD: ఇది మరో ‘రాజావారి చేపల చెరువు’

రాజావారి చేపల చెరువు మూవీ మెసేజ్‌ను తలపించిందీ ఘటన. ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్‌తో SBI బ్యాంకు నుంచి రూ.6 కోట్లు తీసుకున్న నిందితులు ఎట్టకేలకు బుక్కయ్యారు. నెక్నాంపూర్‌లో లేని ల్యాండ్ ఉందని ఫేక్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసి నగదు తీసుకున్నట్లు తేల్చిన సైబరాబాద్ EOW అధికారులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన నిందితులు చాటెడ్ అకౌంటెంట్ నారాయణ, రవి అరెస్ట్ అయ్యారు.