News August 17, 2025

శ్రీ శక్తి పథకం అమలుపై జిల్లా అధికారి ఆరా

image

విశాఖ జిల్లాలో అమలవుతున్న శ్రీ శక్తి పథకం అమలుతీరును జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు పరిశీలించారు. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులో ఈ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ద్వారకా బస్ స్టేషన్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News September 10, 2025

అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ ఇవ్వద్దు: జీవీఎంసీ కమిషనర్

image

నగరంలోని జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్ ఫోర్‌లో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనగా అక్రమ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయి. ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు ఏసీపీ ఝాన్సీ లక్ష్మీని అడిగారు. జీవన్‌సి ఆర్థిక పరిపుష్టి సాధించే ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జోనల్ కమిషనర్ పాల్గొన్నారు.

News September 9, 2025

ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ విజేత విజయవాడ బ్లాస్టర్స్

image

విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ 2025లో విజయవాడ బ్లాస్టర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో రాయలసీమ రాణీస్‌పై 13 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. మేఘన – 49, మహంతి శ్రీ – 37, రంగ లక్ష్మి – 33 పరుగులతో రాణించారు. బౌలింగ్‌లో రిషిక కృష్ణన్ 3 వికెట్లు తీసింది. మిథాలీ రాజ్ చేతుల మీదుగా జట్టు రూ.6 లక్షల ప్రైజ్ మనీతో ట్రోఫీ అందుకుంది.

News September 9, 2025

ఆరిలోవ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

మూడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అడవివరం నుంచి వస్తున్న వ్యానును ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో శ్రీ కృష్ణాపురం నివాసి గుడ్ల గోవిందరాజు (34), మరో యువకుడు హరీశ్‌ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ఎస్ఐ వై.కృష్ణ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించామన్నారు.