News August 17, 2025

రాబోయే గంటలో వర్షం

image

హైదరాబాద్‌లో రాబోయే గంట సేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ <<17432128>>వర్షాలు<<>> పడతాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ADB, HNK, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, వికారాబాద్, WGL జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

Similar News

News August 18, 2025

భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

News August 18, 2025

అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై ఆరోపణలు: MLA కూన

image

AP: శ్రీకాకుళం(D) పొందూరు KGBV ప్రిన్సిపల్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆముదాలవలస TDP MLA కూన రవికుమార్ అన్నారు. ‘KGBVలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే ప్రిన్సిపల్ <>YCP<<>> నేతలతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తోంది. “తల్లికి వందనం”పై ముగ్గురు ప్రిన్సిపల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాను. కేవలం పొందూరు ప్రిన్సిపల్‌తోనే వీడియో కాల్ తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు’ అని తెలిపారు.

News August 18, 2025

బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ!

image

బెంగళూరులోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తి ప్రారంభమైంది. చెన్నై యూనిట్‌లో కూడా వీటి ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 6 కోట్ల ఐఫోన్లు తయారు చేయాలని ఫాక్స్‌కాన్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 2.8 బిలియన్ డాలర్ల వ్యయంతో బెంగళూరు దగ్గర్లోని దేవనహళ్లిలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ నెలకొల్పింది. ఐఫోన్‌ 17ను యాపిల్‌ సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.