News August 17, 2025

మైదుకూరు: వెలుగులోకి బ్రిటీశ్ కాలం నాటి వస్తువులు

image

మైదుకూరు మున్సిపాలిటీ విశ్వనాథపురం గ్రామంలో బ్రిటీశ్ కాలం నాటి 12 టోలాస్ (ఇనుప తూనికరాయి), పిడిబాకు లాంటి వస్తువులు వెలుగులోకి వచ్చినట్లు చరిత్ర కారుడు బొమ్మిశెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. టోలా అనేది భారతదేశంలో బరువును కొలవడానికి ఉపయోగించే ఒక సాంప్రదాయ సాధనమన్నారు. గతంలో ఎలక్ట్రానిక్ త్రాసులు లేనప్పుడు బంగారం తూకం వేయటానికి ఈ రకమైన బరువును ఉపయోగించేవారని చెప్పారు.

Similar News

News August 17, 2025

ప్రొద్దుటూరులో కాలేజీ లెక్చరర్ ఆత్మహత్య

image

ఈ ఘటన ప్రొద్దుటూరులో జరిగింది. టూ టౌన్ సీఐ సదాశివయ్య వివరాల మేరకు.. స్వరాజ్యనగర్‌కు చెందిన పవిత్ర(25) ఎంటెక్ చదివి ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఓ వ్యక్తిని ప్రేమించగా వాళ్ల పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించారు. వచ్చే ఏడాదిలో వివాహం చేస్తామని చెప్పారు. ఇంతలో ఏమైందో ఏమో శనివారం ఆమె ఇంట్లోనే ఉరేసుకున్నారు. గమనించిన బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

News August 16, 2025

ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి ఖైదీ పరార్.. DIG విచారణ.!

image

ప్రొద్దుటూరు సబ్ జైల్ నుంచి రిమాండ్ ఖైదీ మహమ్మద్ పరారీపై జైళ్ల శాఖ డీఐజీ రవికుమార్ విచారణ చేపట్టారు. ఆ ఘటనపై శనివారం ప్రొద్దుటూరు సబ్ జైలుకు వచ్చారు. ఇక్కడి జైలర్, సిబ్బందిని విచారించారు. అనంతరం ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. DIG వెంట కడప జిల్లా జైలర్ అమర్ ఉన్నారు. స్థానిక డీఎస్పీ భావన సీఐలు, ఎస్ఐలతో కలిసి జైలు ప్రాంగణాన్ని, ప్రహారీ గోడను పరిశీలించారు.

News August 16, 2025

కడపకు ప్రథమ స్థానం

image

APSPDCL పరిధిలో కడప జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఆ సంస్థ సీఎండీ సంతోష్ రావు చేతుల మీదుగా కడప ఎస్ఈ రమణ ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపిక అందుకున్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. విద్యుత్ ప్రమాదాల నివారణ, వినియోగదారులకు మెరుగైన సేవలు, వాట్సప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు అందించారు.