News August 17, 2025
శ్రీశైలం డ్యామ్‌కు తగ్గిన వరద.. 2 గేట్లు మూసివేత

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. దీంతో డ్యామ్ 5 గేట్లలో శనివారం ఒక్క గేటు, ఆదివారం మరొక గేటు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం మూడు గేట్లద్వారా 79,269 క్యూసెక్కుల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65,807 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి డ్యాం నీటిమట్టం 881.40 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం 195.6605 టీఎంసీలుగా నమోదైంది.
Similar News
News August 18, 2025
MBNR: ఓపెన్ SSC, INTER.. ఇవాళే లాస్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు నేటితో (ఫైన్ లేకుండా) గడువు ముగుస్తుందని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 28లోగా ఫైన్‌తో అప్లై చేసుకోవచ్చని, ఆసక్తిగల విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. చదువు మానేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT
News August 18, 2025
భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో సెలవు

AP: భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
News August 18, 2025
అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై ఆరోపణలు: MLA కూన

AP: శ్రీకాకుళం(D) పొందూరు KGBV ప్రిన్సిపల్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆముదాలవలస TDP MLA కూన రవికుమార్ అన్నారు. ‘KGBVలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే ప్రిన్సిపల్ <