News August 17, 2025
MHBD: భారీ వర్షాలు.. ఉన్నత స్థాయి సమీక్ష!

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో MHBD జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సీతక్క నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల జిల్లాలోని లో లెవల్ వంతెనలపై వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయన్నారు. దీంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలు రాం చంద్రు నాయక్, మురళీ నాయక్, ఇంచార్జ్ కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News August 18, 2025
MBNR: ఓపెన్ SSC, INTER.. ఇవాళే లాస్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు నేటితో (ఫైన్ లేకుండా) గడువు ముగుస్తుందని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 28లోగా ఫైన్‌తో అప్లై చేసుకోవచ్చని, ఆసక్తిగల విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. చదువు మానేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT
News August 18, 2025
భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో సెలవు

AP: భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
News August 18, 2025
అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై ఆరోపణలు: MLA కూన

AP: శ్రీకాకుళం(D) పొందూరు KGBV ప్రిన్సిపల్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆముదాలవలస TDP MLA కూన రవికుమార్ అన్నారు. ‘KGBVలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే ప్రిన్సిపల్ <