News August 17, 2025
అలాంటి సినిమాలను ఆపేయాలి: లోకేశ్

AP: సినిమాల్లో మహిళలపై వివక్షను కట్టడి చేసేందుకు సమయం ఆసన్నమైందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘మహిళలకు మనమిచ్చే గౌరవమే నిజమైన నాగరిక సమాజానికి పునాది. వారి పట్ల లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలను కట్టడి చేయాలి. అలాంటి డైలాగ్స్ ఉన్న మూవీ లేదా సీరియల్‌ను ఆపేయాలి. ఇంట్లో, స్క్రీన్‌పై చూసే అంశాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News August 18, 2025
భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో సెలవు

AP: భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
News August 18, 2025
అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై ఆరోపణలు: MLA కూన

AP: శ్రీకాకుళం(D) పొందూరు KGBV ప్రిన్సిపల్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆముదాలవలస TDP MLA కూన రవికుమార్ అన్నారు. ‘KGBVలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే ప్రిన్సిపల్ <
News August 18, 2025
బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ!

బెంగళూరులోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తి ప్రారంభమైంది. చెన్నై యూనిట్‌లో కూడా వీటి ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 6 కోట్ల ఐఫోన్లు తయారు చేయాలని ఫాక్స్‌కాన్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 2.8 బిలియన్ డాలర్ల వ్యయంతో బెంగళూరు దగ్గర్లోని దేవనహళ్లిలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ నెలకొల్పింది. ఐఫోన్ 17ను యాపిల్ సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.