News August 17, 2025

కృష్ణా జిల్లాలో డెంగీ ఆందోళన

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా డెంగీ జ్వరం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా నీరసించి, ఏం జరిగిందో తెలియని అయోమయంలో పలువురు రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రక్త కణాలు వేగంగా తగ్గిపోవడం, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల తీవ్రమైన స్థితిలో ఉన్నవారు విజయవాడ వంటి పెద్ద నగరాల ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స కోసం వెళ్తున్నారు.

Similar News

News August 19, 2025

విజయవాడ: సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 4.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని అధికారులు తెలిపారు. రేపటికి మరింత పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. అత్యవసర సహాయక చర్యల కోసం కృష్ణా జిల్లా అవనిగడ్డ, NTR జిల్లా విజయవాడ, కృష్ణా ఘాట్‌లలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

News August 19, 2025

H.జంక్షన్ పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

హనుమాన్ జంక్షన్ పోలీసులను ఒక ప్రేమ జంట ఆశ్రయించింది. తాము గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, సోమవారం విజయవాడలోని గుణదల చర్చిలో కులాంతర వివాహం చేసుకున్నామని షేక్ హసీనా (21), ఏడుకొండలు (23) తెలిపారు. వీరిద్దరూ మడిచర్లకి చెందినవారు. తమ పెద్దల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

News August 19, 2025

మచిలీపట్నం: ‘బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం’

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీ ఆర్. గంగాధరరావు ఐపీఎస్ ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. చట్టపరంగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విని, అవసరమైతే కేసులు నమోదు చేసి సహాయం అందిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.