News August 17, 2025
ఏలూరు: అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృత పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ప్రజలెవ్వరూ నదిలోకి ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయవద్దన్నారు. అత్యవసర సమయంలో వినియోగం నిమిత్తం మోటార్ బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలన్నారు.
Similar News
News August 18, 2025
స్పెషల్ సూట్‌కేస్‌లో పుతిన్ మలం.. ఎందుకో తెలుసా?

రష్యా వంటి శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడైన పుతిన్ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు అతని మలాన్ని సేకరించి సొంత దేశానికి తీసుకొస్తారని ఫ్రాన్స్ జర్నలిస్టులు వెల్లడించారు. స్పెషల్ బ్యాగుల్లో మలాన్ని సేకరించి, వాటిని బ్రీఫ్‌కేసుల్లో తీసుకొస్తారని పేర్కొన్నారు. విదేశీ శక్తులు పుతిన్ వ్యర్థాల శాంపిళ్లతో ఆరోగ్య రహస్యాలు తెలుసుకోకుండా ఇలా చేస్తారట.
News August 18, 2025
నాగర్‌కర్నూల్‌లో పాఠశాలలకు సెలవు

నాగర్‌కర్నూల్‌లో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. రాకపోకలకు అంతరాయం ఉన్న పాఠశాలలకు సెలవు ఇవ్వాలని డీఈవో రమేశ్ కుమార్ ఆదేశించారు. అంతేకాకుండా, సీజనల్ వ్యాధులు రాకుండా పాఠశాలల ప్రాంగణాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు.
News August 18, 2025
రికార్డు స్థాయిలో 23.6సెం.మీల వర్షపాతం

TG: రాష్ట్రంలో గడిచిన 12 గంటల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట(D) గౌరారంలో అత్యధికంగా 23.6cmల వర్షపాతం నమోదైంది. ములుగు(సిద్దిపేట)లో 18.6cm, మెదక్‌లోని ఇస్లాంపూర్‌లో 17.85cm, పిట్లం(కామారెడ్డి)లో 17.3cm, కౌడిపల్లి(మెదక్)లో 17.2cm, సంగారెడ్డిలో కంగ్టిలో 16.6cm, శంకరంపేట(మెదక్)లో 16.4cm, అడ్డగూడురు(యాదాద్రి)లో 16.4cmల వర్షపాతం కురిసినట్లు వెల్లడించింది.