News August 17, 2025
ఆసియా కప్: హర్ష భోగ్లే టీమ్ చూశారా?

వచ్చే నెల 9న ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే 15 మందితో కూడిన ఇండియన్ టీమ్‌ను ప్రకటించారు. జైస్వాల్, గిల్‌కు ఇందులో చోటు దక్కకపోవడం గమనార్హం.
టీమ్: అభిషేక్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, అక్షర్, సుందర్, శాంసన్, జితేశ్ శర్మ, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్.
ఈ టీమ్‌పై మీ కామెంట్?
Similar News
News August 18, 2025
కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. ఐదుగురు దుర్మరణం

TG: హైదరాబాద్‌లో జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రామాంతపూర్‌లోని గోకుల్ నగర్‌లో శ్రీ కృష్ణ శోభా యాత్ర నిర్వహిస్తుండగా రథానికి కరెంట్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. మృతులను శ్రీ కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్రవికాస్, రాజేంద్రరెడ్డిలుగా గుర్తించారు.
News August 18, 2025
EP-40: వీరితో శత్రుత్వం వద్దు: చాణక్య నీతి

కొంతమందితో ఎప్పటికీ శత్రుత్వం పెంచుకోకూడదని, అది ఖరీదైనదిగా మారుతుందని చాణక్య నీతి చెబుతోంది. ‘మీ పొరుగువారితో సంబంధాలు చెడితే శత్రువులుగా మారుతారు. అత్యంత సన్నిహితులతోనూ శత్రుత్వం వద్దు. మీ రహస్యాలు, బలహీనతలు బయటపడి ముప్పుగా మారవచ్చు. కుటుంబసభ్యులనూ శత్రువులుగా చేసుకోవద్దు. ప్రభావవంతమైన వ్యక్తులతోనూ శత్రుత్వం వద్దు. ఆఫీసులో సహోద్యోగులతో శత్రుత్వం పెంచుకోకూడదు’ అని చెబుతోంది. #<<-se>>#Chanakyaneeti<<>>
News August 18, 2025
మాధవ్ కౌశిక్ ఊచకోత.. 31 బంతుల్లోనే 95*

యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావరిక్స్ బ్యాటర్ మాధవ్ కౌశిక్ అరాచకం సృష్టించారు. కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచులో మాధవ్ 31 బంతుల్లోనే 95* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అతడి ఇన్నింగ్సులో 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మాధవ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 300పైన ఉండటం విశేషం. అతడి దూకుడుతో మీరట్ ఓవర్లన్నీ ఆడి 225/2 పరుగులు చేసింది. ఛేదనలో కాన్పూర్ 20 ఓవర్లలో 139/9 పరుగులకే పరిమితమైంది.