News August 17, 2025
HYD: OUలో 84వ స్నాతకోత్సవం..121 గోల్డ్ మెడల్స్ ప్రదానం

ఓయూ 84వ స్నాతకోత్సవం ఈనెల 19న ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్నాతకోత్సవంలో
✒121 బంగారు పతకాలు
✒పీహెచ్డీ పూర్తి చేసిన 1261 మంది విద్యార్థులకు పట్టాలు
✒108 ఏళ్ల OU చరిత్రలో మొట్ట మొదటి సారిగా గౌరవ కులపతి, రాష్ట్ర గవర్నర్ పేరుతో గిరిజన విద్యార్థులకు ఆంగ్లంలో పీహెచ్డీ డిగ్రీకి బంగారు పతకం
✒ఈ ఏడాది నుంచి ఎంబీఏ ఫైనాన్స్‌లో ప్రొఫెసర్ సముద్రాల సత్యనారాయణ మూర్తి స్మారక బంగారు పతకం అందిస్తున్నారు.
Similar News
News August 18, 2025
భద్రాద్రి: గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం

భద్రాచలంలోని గోదావరి నదీ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 34.8 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాద సూచికల స్థాయికి చేరకపోయినా, ఎడతెరపి వర్షాలు కొనసాగుతున్నందున నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News August 18, 2025
భద్రాద్రి: సీఎం ప్రారభించునున్న ఇందిరమ్మ ఇల్లు ఇదే!

ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి చండ్రుగొండ మండలం బెండలపాడులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న విషయాన్ని తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ఇందిరమ్మ నివాసం సిద్ధమవుతుంది. జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే ఆదినారాయణ గత మూడు రోజులుగా పనులను పర్యవేక్షిస్తున్నారు. కాగా నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బెండాలపాడులో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
News August 18, 2025
వనపర్తి: భారీ వర్షాల దృష్ట్యా ఎస్పీ సూచనలు ఇలా..!

వనపర్తి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు జిల్లా ప్రజలు కింది జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు.
* విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితులను తాకకూడదు.
* ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువులను దాటేందుకు ప్రయత్నం చేయకూడదు.
* రోడ్డుపై నడిచేటప్పుడు అప్రమతంగా ఉండాలి మ్యాన్ హోల్స్ గుంతల పట్ల జాగ్రత్తలు వహించండి.
* అత్యవసర సమయాలు 100కు డయల్ చేసి పోలీసుల సహాయం పొందాలన్నారు.