News August 17, 2025

మెదక్: గణేశ్ మండపాల వివరాలు ఆన్‌లైన్ తప్పనిసరి: ఎస్పీ

image

రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ మండప నిర్వాహకులు, సభ్యులు, కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ వారు రూపొందించిన వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

Similar News

News August 18, 2025

మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ: కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే తీసుకోనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వర్షాలు, వరదల వల్ల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ వ్యక్తిగత, ఇతర సమస్యలపై వినతి పత్రాలు వచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కలెక్టరేట్లో డెస్క్ అందుబాటులో ఉంటుందన్నారు.

News August 18, 2025

మెదక్: అత్యధికంగా తూప్రాన్‌లో 179.5 మిమీలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా ఇస్లాంపూర్‌లో 179.5 మిమీలు కురిసింది. కౌడిపల్లిలో 172.5, పెద్ద శంకరంపేటలో 165.5, దామరంచలో 160.8, మాసాయిపేటలో 148.8, శివంపేటలో 147, వెల్దుర్తిలో 143.8, కొల్చారంలో 137.5, కాళ్లకల్‌లో 130, బోడగట్టులో 126.3, నర్సాపూర్‌లో 126.3 మిమీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

News August 18, 2025

మెదక్: బోనస్ డబ్బుల కోసం వేటింగ్

image

రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. బోనస్ నేటికీ రైతుల ఖాతాలో జమ కాలేదు. కొనుగోలు జరిపి దాదాపు 5 నెలలు గడుస్తున్నప్పటికీ బోనస్ పడకపోవడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఖాతాలో బోనస్ జమ చేయాలని వేడుకుంటున్నారు.