News April 1, 2024
HYD: 6 నుంచి దూరవిద్య పబ్లిక్ పరీక్షలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) సెకండరీ(పదో తరగతి), సీనియర్ సెకండరీ(12వ తరగతి) పబ్లిక్ పరీక్షలు ఈనెల 6 నుంచి మే 22వరకు నిర్వహించనున్నట్లు NIOS HYD ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రమణ్యం తెలిపారు. విద్యార్థులు పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు హాల్టికెట్లను NIOS వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 040-24752859, 24750712నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News April 5, 2026
రంగారెడ్డి: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ!

రంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు SBI RSETI సువర్ణావకాశం కల్పిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఏప్రిల్ 13 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో పాటు కోర్సు పూర్తయ్యాక ఉచితంగా టూల్‌కిట్ అందిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 7981951167, 9963562266 నంబర్లలో సంప్రదించాలన్నారు.
News April 4, 2026
రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.
News April 4, 2026
సరూర్‌నగర్: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల వివరాలను సంఘం కార్యదర్శి గోపి వెల్లడించారు. 16 ఏళ్లు పైబడిన వారు, అలాగే అండర్-20 పురుషులు, మహిళా విభాగాల్లో ఈ క్రీడలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


