News August 17, 2025
భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: అల్పపీడన ప్రభావంతో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పశ్చిమగోదావరి, కాకినాడకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఈ జిల్లాలోనూ సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Similar News
News August 18, 2025
సలాడ్స్ తింటే ఎన్ని లాభాలో..

సలాడ్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలోని పోషకాలు, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ & నీరు ఉండటంతో కడుపు నిండిన అనుభూతిని కలుగుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఆకుకూరలు, టమాటాలు, అవకాడోలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
News August 18, 2025
ప్రేయసితో రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం

‘ఆస్కార్’తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన ప్రేయసి హరిణి రెడ్డితో త్వరలోనే ఆయన ఏడడుగులు వేయనున్నారు. నిన్న హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. హరిణి నేపథ్యం గురించి తెలియాల్సి ఉంది.
News August 18, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం?

ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు NDA కసరత్తులు చేస్తోంది. ఇదే విషయమై AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీ నేతలతో BJP నేతలు మాట్లాడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల బరిలో నిలవాలని INDI కూటమి ఆలోచనలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణను ప్రకటించిన సంగతి తెలిసిందే.