News August 17, 2025
పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి సమావేశం

పంచాయితీ రాజ్ శాఖ జిల్లా అధికారులతో మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశం నిర్వహించారు. అందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంచాయత్ రాజ్ శాఖ అధ్వర్యంలో చేపడుతున్న నూతన రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, పునర్ నిర్మాణ పనులపై సమీక్షించారు. యుద్ధ ప్రతిపాదిక పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Similar News
News August 18, 2025
మెదక్: భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. వర్షాల వల్ల జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ఏ ఆపద వచ్చిన లోకల్ పోలీస్ అధికారులు, డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం 87126 57888 నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.
News August 18, 2025
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ: కలెక్టర్

మెదక్ కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే తీసుకోనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వర్షాలు, వరదల వల్ల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ వ్యక్తిగత, ఇతర సమస్యలపై వినతి పత్రాలు వచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కలెక్టరేట్లో డెస్క్ అందుబాటులో ఉంటుందన్నారు.
News August 18, 2025
మెదక్: అత్యధికంగా తూప్రాన్‌లో 179.5 మిమీలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా ఇస్లాంపూర్‌లో 179.5 మిమీలు కురిసింది. కౌడిపల్లిలో 172.5, పెద్ద శంకరంపేటలో 165.5, దామరంచలో 160.8, మాసాయిపేటలో 148.8, శివంపేటలో 147, వెల్దుర్తిలో 143.8, కొల్చారంలో 137.5, కాళ్లకల్‌లో 130, బోడగట్టులో 126.3, నర్సాపూర్‌లో 126.3 మిమీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.