News August 17, 2025
బోనకల్: సీపీఎం సీనియర్ నాయకుడిని కలిసిన కేరళ ఎమ్మెల్యే

బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడు మాధినేని నారాయణను కేరళ ఎమ్మెల్యే కె.కె.రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకుల అనుభవం, మార్గదర్శకత్వం అవసరమని రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
Similar News
News August 18, 2025
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు.
News August 18, 2025
‘సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి’

ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు నిర్ణీత నమూనాలో సమర్పించాలని అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుపై సోమవారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 4,700 కు పైగా ప్రభుత్వ కనెక్షన్ లు ఉన్నాయనీ, 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారన్నారు.
News August 18, 2025
సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. సమానత్వం, స్వాభిమానం కోసం 400 సంవత్సరాల క్రితమే గొంతెత్తిన మహనీయుడని పేర్కొన్నారు.