News August 17, 2025
శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు రేపు సెలవు

శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం కలెక్టర్ సెలవు ప్రకటించారు. వాయుగుండం ప్రభావం వల్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. రేపటి సెలవు దినాన్ని మరో రోజు పనిచేయవలసి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Similar News
News August 18, 2025
అంబేడ్కర్ యూనివర్సిటీకి సెలవు: VC

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీకి సోమవారం సెలవు ప్రకటించారు. స్థానిక వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కె.ఆర్. రజిని ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలకు కూడా సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News August 18, 2025
SKLM: 19, 20 తేదీల్లో జోనల్ స్థాయి క్రీడా పోటీలు

19, 20 తేదీల్లో విశాఖలోని జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. శ్రీధర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి ఇప్పటికే సమాచారం అందించామన్నారు. వారందరూ శ్రీకాకుళం కోడి రామమూర్తి మున్సిపల్ స్టేడియంకు 19న ఉదయం 5 గంటలకు హాజరు కావాలన్నారు. పూర్తి సమాచారానికి 98850 96734 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News August 18, 2025
SKLM: ‘తుఫాన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు’

శ్రీకాకుళం జిల్లాలోని ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో తుఫాన్ అలర్ట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19 వరకు అధికారులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని తెలియజేశారు. నిత్యావసర వస్తువులు నిల్వలు ఉంచాలని సూచించారు.