News August 18, 2025
రాయికల్ : గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య

రాయికల్ (M) అయోధ్య గ్రామానికి చెందిన ఎడమల సాయిరెడ్డి (21) ఆదివారం ఉదయం గడ్డి మందు తాగగా, రాత్రి జగిత్యాల ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి రెడ్డి హైదరాబాదులో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఆదివారం ఉదయం స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Similar News
News August 18, 2025
కృత్రిమ కొరత సూచిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

రెవిన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి సోమవారం సమీక్ష సమావేశాన్ని జరిపారు. రైతుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే రైతులకు కావాల్సిన డీఏపీ అందుబాటులో ఉందన్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సూచిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే షాపు లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామన్నారు.
News August 18, 2025
మెదక్: భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. వర్షాల వల్ల జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ఏ ఆపద వచ్చిన లోకల్ పోలీస్ అధికారులు, డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం 87126 57888 నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.
News August 18, 2025
వర్షాలు ఎక్కువైతే సెలవులు పొడిగిస్తాం: మంత్రి సంధ్యారాణి

AP: వర్షాలు ఎక్కువగా ఉంటే పాఠశాలలకు సెలవులు పొడిగిస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ప్రభుత్వం సమీక్షిస్తోందని తెలిపారు. ఏడాదిలోనే దాదాపు రూ.1,300 కోట్లు రహదారుల అభివృద్ధికే వినియోగించామన్నారు. రాబోయే 3 ఏళ్లలో గిరిజన ప్రాంతాల్లో మెజారిటీ రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.