News August 18, 2025
కాచాపూర్: బావిలో దూకి మహిళ ఆత్మహత్య

వ్యవసాయ బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకరపట్నం మండలం కాచాపూర్‌లో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన అబ్బు శకుంతల (58) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే మతిస్థిమితం కూడా కోల్పోయి ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News August 18, 2025
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: నిర్మల్ ఎస్పీ

నిర్మల్ జిల్లాలో డీజే, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శబ్ద కాలుష్యం వల్ల ప్రజలకు అసౌకర్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద పరికరాల వినియోగం పూర్తిగా నిషిద్ధమని ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
News August 18, 2025
కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగాయి: రేవంత్

TG: కేసీఆర్ 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం BC రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా మారిందని సీఎం రేవంత్ అన్నారు. ‘BCలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చాం. అది మన గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. కేసీఆర్ తెచ్చిన చట్టంలో రిజర్వేషన్లు 50% మించకూడదని ఉంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో దానిపై ఆర్డినెన్స్ తెచ్చాం’ అని తెలిపారు.
News August 18, 2025
MNCL: రైలులో ప్రయాణిస్తూ వ్యక్తి మృతి

రైలులో ప్రయాణిస్తూ ఒక వ్యక్తి మృతి చెందాడు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన ధన్పత్ లాల్ యాదవ్ తమిళనాడులో పనిచేసేందుకు గ్రామస్తులతో కలిసి రైలులో వెళుతుండగా అస్వస్థతకు గురయ్యాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతదేహాన్ని మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో దింపగా.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.