News August 18, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ జితేష్ వి పాటిల్
✓పాల్వంచ బస్టాండ్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని
✓Way2News కథనానికి స్పందన.. సారపాకలో రోడ్లకు మరమ్మతులు
✓మణుగూరులో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొట్టిన డీసీఎం
✓భద్రాద్రి రామాలయంలో అన్నదానానికి రూ.లక్ష విరాళం
✓సీపీఐ నేత అయోధ్య సంస్మరణ సభలో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే పాయం
✓పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలానికి ముప్పు: సీపీఎం
Similar News
News August 18, 2025
అంబేడ్కర్ యూనివర్సిటీకి సెలవు: VC

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీకి సోమవారం సెలవు ప్రకటించారు. స్థానిక వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కె.ఆర్. రజిని ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలకు కూడా సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News August 18, 2025
NLG: చేప పిల్లలు వచ్చేస్తున్నాయ్..!

జిల్లాలోని ఉచిత చేప పిల్లల పంపిణీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మత్స్య కారుల ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రభుత్వం కొన్నేళ్లుగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామపంచాయతీ చెరువులు కుంటలు కలిపి 1160కి పైగానే ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత చేప పిల్లల పంపిణీ చేయనున్నారు.
News August 18, 2025
NLG: పోస్టులు ఖాళీ.. ఉన్న వారిపైనే భారం!

నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖలో ఉద్యోగ ఖాళీల కొరత వేధిస్తోంది. నాలుగేళ్లుగా కిందిస్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టడం లేదు. దీంతో తమపై అదనపు పనిభారం పడుతోందని ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులు 50, జూనియర్ లైన్మెన్ పోస్టులు122 భర్తీ చేయాల్సి ఉంది. సరిపడా సిబ్బంది లేక ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని స్థానికులు తెలిపారు.