News August 18, 2025
గోల్కొండ కోటను ఏలిన గౌడన్న

సర్వాయి పాపన్న గౌడ్.. గోల్కొండను ఏలిన వీరుడు. జనగామ(D) ఖిలాషాపూర్‌లో జన్మించాడు. పెద్దలను దోచి పేదలకు పంచిన ఈయన జమీందార్లలో వణుకు పుట్టించాడు. 12 మందితో మొదలైన పాపన్న దళం 12 వేలకు విస్తరించి, చివరకు గోల్కొండలో బహుజన జెండా ఎగరేశాడు. ఇది నచ్చని జమీందార్లు మొగల్ రాజును ఉసిగొల్పి, పాపన్న మీద దాడి చేయించారు. శతృవులు చంపారని కొందరు, పాపన్నే ప్రాణత్యాగం చేశారని మరికొందరు చెబుతారు.
నేడు పాపన్న గౌడ్ జయంతి.
Similar News
News August 18, 2025
UPDATE: జల్‌పల్లిలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బండ్లగూడ PS పరిధిలో షేక్ పాషా కిడ్నాప్ కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. పని ముగించుకొని ఇంటికి వస్తున్న పాషాను షేక్ అమీర్, మహ్మద్ ఒమర్ గ్యాంగ్ చాకుతో బెదిరించి కిడ్నాప్ చేశారు. మొదట రూ.2,000 తీసుకున్న తర్వాత, మరో రూ.20,000 డిమాండ్ చేస్తూ పాషా సోదరుడికి వీడియో కాల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు జల్‌పల్లిలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.
News August 18, 2025
HYD: పైళ్లైన విషయం దాచి యువతితో డాక్టర్ సహజీవనం

ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ పోసినపల్లి రాజేందర్‌రెడ్డి (35), పెళ్లయిన విషయాన్ని దాచి ఒక డిజైనర్(28)తో సహజీవనం చేస్తున్నారు. పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆ యువతిపై దాడి చేశాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
News August 18, 2025
నేటి ఆమనగల్ బంద్ వాయిదా

మార్వాడీ గో బ్యాక్ పేరిట ఆమనగల్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంపై ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక కిరాణ, వర్తక, వస్త్ర, బంగారం వ్యాపారులు మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు. గత శుక్రవారం కరపత్రాలు ముద్రించి దుకాణాల్లో పంచారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేడు పెట్టిన బంద్‌ను స్థానిక వ్యాపారులు విరమించుకున్నారు.