News August 18, 2025

SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.

Similar News

News August 18, 2025

మత్స్యకారులు వేటకు పోవద్దు.. శ్రీకాకుళం కలెక్టర్ సూచనలు

image

అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తీరం దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇప్పటికే సంబంధిత అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.

News August 18, 2025

అంగన్వాడీ సిబ్బంది కేంద్రాల్లో ఉండాలి: ఐసీడీఎస్

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల నేపథ్యంలో సోమవారం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ చిన్నారులకు సెలవు ప్రకటించినట్లు ఐసీడీఎస్ పీడీ ఐ.విమల తెలిపారు. అయితే కార్యకర్తలు, సహాయకులు కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా స్టాక్ నిల్వలను భద్రంగా ఉంచాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. సిబ్బందిపై సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేయాలని ఆమె స్పష్టం చేశారు.

News August 18, 2025

అంబేడ్కర్ యూనివర్సిటీకి సెలవు: VC

image

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీకి సోమవారం సెలవు ప్రకటించారు. స్థానిక వైస్‌ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కె.ఆర్. రజిని ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలకు కూడా సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.