News April 1, 2024
‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇదివరకే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుండగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ దీనికి వేదిక కానున్నట్లు సమాచారం.
Similar News
News March 6, 2026
తనూజ, దివ్వెల మాధురిపై పోలీసులకు ఫిర్యాదు

AP: తిరుమలలో <<19305826>>దివ్వెల మాధురి<<>>, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడంపై TTD స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుపుకున్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల గెస్ట్ హౌస్‌లలో ఇలాంటి వేడుకలు నిషేధమని వెల్లడించింది. వీడియోలు తీసి SMలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇక ఈ ఘటనపై TTD విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 6, 2026
పెట్రోల్ ధరలు పెరుగుతాయా?.. కేంద్ర వర్గాలు ఏం చెప్పాయంటే..

దేశంలో పెట్రోల్ ధరలు పెరగవని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ‘రష్యా నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తున్నాం. ముడి చమురు విషయంలో పరిస్థితి అదుపులోనే ఉంది. దేశీయ మార్కెట్లలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగవు’ అని వివరించాయి. హార్ముజ్ జలసంధి గుండా గ్యాస్, ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తగినంత మేర రిజర్వులు ఉన్నాయని వెల్లడించాయి.
News March 6, 2026
బాలెన్ షా.. జెంజీల నయా బాద్‌షా!

నేపాల్ వారసత్వ రాజకీయాలపై తిరగబడ్డ Gen-Z ఉద్యమాన్ని బాలెన్ షా ముందుండి నడిపించారు. 36ఏళ్ల ఈ యువనేత.. స్ట్రక్చరల్ ఇంజినీర్, ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, నటుడు, రైటర్, కవిగా నేపాలీలకు సుపరిచితుడు. 2022లో ఖాట్మండు మేయర్‌గా ఎన్నికై ప్రభుత్వాన్ని నిలదీయడంతో యూత్‌లో క్రేజ్ సంపాదించారు. దీంతో ఎన్నికల్లో ఆయనకు భారీగా ఓట్లు పడినట్లు తెలుస్తోంది. తన పార్టీ RSP <<19309327>>విజయం<<>> సాధిస్తే బాలెన్ నేపాల్ PM అవుతారు.


