News August 18, 2025
రేపు విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు: డీఈవో

విశాఖలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలకు సెలవిచ్చినట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News August 18, 2025
అధికారులతో విశాఖ ఇన్‌ఛార్జ్ మంత్రి భేటీ

విశాఖ సర్క్యూట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు. రెండు రోజులుగా విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకున్న చర్యలపై సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతం గీతం కాలేజీకి బయలుదేరి వెళ్లారు.
News August 18, 2025
విశాఖలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవు లేదా?

అల్పపీడనం నేపథ్యంలో విశాఖలో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అయితే అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇవ్వకపోవడంతో ఏదో విధంగా తల్లిదండ్రులు చిన్నారులను పంపిస్తున్నారు. స్కూల్, కాలేజీలు సెలవులు ఇచ్చి అంగన్వాడీలకు ఇవ్వకపోవడంతో చిన్నారులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
News August 18, 2025
విశాఖలో అర్ధరాత్రి వ్యక్తిపై గన్‌తో కాల్పులు

విశాఖ వన్‌టౌన్ పరధిలో ఆదివారం అర్ధరాత్రి గన్‌తో కాల్పుల ఘటన కలకలం రేపింది. చిలకపేటలో నివాసం ఉంటున్న రాజేశ్‌పై నూకరాజు అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో వీరి మధ్య వివాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితుడు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని వద్దకు గన్ ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది.