News August 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News August 19, 2025
RED ALERT: ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అటు ఏపీలోని అల్లూరి, ఏలూరు, NTR జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
News August 19, 2025
నేడే ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రకటన?

ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ ఇవాళ జట్టును ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి. జట్టు సెలక్షన్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో జట్టు కూర్పుపై వారు మాట్లాడతారని సమాచారం. అలాగే పాకిస్థాన్‌తో జరిగే మ్యాచులపైనా స్పష్టత ఇచ్చే అవకాశముంది.
News August 19, 2025
సినిమా సెట్‌లో ఫుడ్ పాయిజన్.. 120 మందికి అస్వస్థత

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ‘ధురంధర్’ మూవీ సెట్లో ఫుడ్ పాయిజన్ జరిగి 120మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ మూవీ షూట్ లద్దాక్‌లోని లేహ్ జిల్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా 600 మంది సిబ్బంది డిన్నర్ చేశారు. తిన్న వెంటనే కొందరు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. వెంటనే వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఫుడ్ శాంపిళ్లను అధికారులు సేకరించి పరీక్షలకు పంపారు.