News August 18, 2025
KMR: కళకళలాడుతున్న ప్రాజెక్టులు

కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో నిండుగా ఉంది. కళ్యాణి ప్రాజెక్టు ఒక గేటు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. కౌలాస్ నాలా, సింగీతం రిజర్వాయర్‌లలోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. జిల్లాలోని ప్రాజెక్టులు జలకళతో కళకళలాడుతున్నాయి.
Similar News
News August 19, 2025
నరసాపురం: సైలింగ్ బోటింగ్‌కు వంద మంది క్యాడెట్లు

వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి 10వ వరకు ఒరిస్సాలోని చిలుక నేవల్ బేస్‌లో నరసాపురం ఆంధ్రా యూనిట్ ఆధ్వర్యంలో సైలింగ్ బోటింగ్ సాహస యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది క్యాడెట్లు పాల్గొనన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను యూనిట్ కమాండర్ సంజిత్ రౌత్రే, డిప్యూటీ క్యాంపు కమాండర్ అనిల్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.
News August 19, 2025
16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్

AP: మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్ మార్కులపై అభ్యంతరాల స్వీకరణ, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టు రావడంతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో వెరిఫికేషన్‌కు పిలవనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
News August 19, 2025
శ్రీకాకుళం: దళారులను నమ్మి మోసపోవద్దు

జిల్లా కోర్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక పరీక్షల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా నిరుద్యోగులను హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కంప్యూటర్ ఆధారిత పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు.