News August 18, 2025

ఆగస్టు 18: చరిత్రలో ఈరోజు

image

1227: మంగోలియా చక్రవర్తి చెంఘీజ్ ఖాన్ మరణం
1650: స్వాతంత్ర్యోద్యమకారుడు సర్వాయి పాపన్న జననం
1868: గుంటూరులో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసి హీలియం ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్త పియర్ జూల్స్ జాన్సెన్
1945: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్(ఫొటోలో)మరణం
1959: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జననం
1980: సినీ నటి ప్రీతి జింగానియా జననం
2011: ఇండియన్ మెడికల్ కౌన్సిల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Similar News

News August 18, 2025

చాపకింద నీరులా ‘మార్వాడీ గో బ్యాక్’

image

గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం <<17429087>>చాపకింద నీరులా<<>> తెలంగాణ అంతటా విస్తరిస్తోంది. ప్రాంతాలు, ఊర్ల వారీగా వాట్సాప్ గ్రూపుల్లో మార్వాడీల వ్యాపార తీరుకు వ్యతిరేకంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి ప్రభావితులైన వారు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. మూమెంట్‌పై ఇంటెలిజెన్స్ కూడా దృష్టిపెట్టిందని సమాచారం. ముందు రోహింగ్యాలను బయటకు పంపాలని BJP అనడంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది.

News August 18, 2025

ఒడిశాలో బంగారు నిల్వలు.. త్వరలోనే తవ్వకాలు

image

ఒడిశాలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) గుర్తించింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో దాదాపు 20 మెట్రిక్ టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా వేసింది. ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది కాస్త ఊరటనివ్వనుంది. ఇప్పటికే బంగారం మైనింగ్‌కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వేలం నిర్వహించనుంది.

News August 18, 2025

ఎల్లుండి వరకు ‘అన్నదాత సుఖీభవ’ గ్రీవెన్స్

image

AP: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉండీ లబ్ధి పొందని రైతులు ఈ నెల 20లోగా గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పరిశీలన, ధ్రువీకరణలో రిజెక్ట్ అయిన దరఖాస్తులు, ఈ కేవైసీ చేసుకోక తిరస్కరణకు గురైన రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని చెప్పారు. కాగా గత నెల 27 వరకు స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, అర్హులను గుర్తించి నిధులు జమ చేసినట్లు వెల్లడించారు.