News August 18, 2025

DEECET స్పాట్ అడ్మిషన్స్.. ఈ నెల 21వ తేదీ లాస్ట్

image

ఉమ్మడి MBNR జిల్లాలో DEECET-2025లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు మహమ్మద్ మేరాజుల్లాఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా DEECETలో అర్హత సాధించి ఉండాలని, అలాగే ఏ కళాశాలలోనూ సీటు పొంది ఉండకూడదన్నారు. అడ్మిషన్ల గడువు ఈ నెల 21 అని ఆయన తెలిపారు.

Similar News

News August 18, 2025

NLG: బత్తాయి ధర ఢమాల్‌

image

నల్గొండ జిల్లా బత్తాయి రైతులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే తోటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతుండగా, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మార్కెట్‌ మాయాజాలం మరింత కుంగదీస్తోంది. బత్తాయి రేటు ఇటీవల ఎన్నడూ లేనంతగా పడిపోయింది. తోటల వద్ద టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు మించి పలకడం లేదు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర పెంచడానికి ససేమిరా అంటున్నారని రైతులు వాపోతున్నారు.

News August 18, 2025

NGKL: గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి

image

గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతిచెందిన ఘటన కల్వకుర్తి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముకురాలకి చెందిన వింజమూరి ఈశ్వరయ్య(55) నిన్న రాత్రి భోజనం చేస్తుండగా గుడ్డు గొంతులో ఇరుక్కుంది. దీంతో అపస్మారక స్థితిలోకెళ్లిన ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News August 18, 2025

ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. పత్తి ధర ఎంతంటే..?

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,720 ధర పలకగా.. సోమవారం రూ.7,660కి పడిపోయింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.