News August 18, 2025

నాగల్‌గిద్ద: పెన్షన్ కోసం ఎదురు చూపు

image

నాగల్‌గిద్ద మండలంలోని శేరిధామస్‌గిద్దకు చెందిన తుర్రురాజు మూడేళ్ల నుంచి నడవలేని స్థితిలో ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం కాలుకి గాయం కావడంతో వైద్యులు అతని రెండు కళ్లు తొడ వరకు తొలగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెన్షన్ కోసం ఎన్ని సార్లు సదరం క్యాంప్‌నకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వేడుకుంటున్నాడు. అధికారులు స్పందించి పెన్షన్ మంజురు చేయాలని బాధితుడు కోరుతున్నాడు.

Similar News

News August 18, 2025

ప్రేయసితో రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం

image

‘ఆస్కార్’తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన ప్రేయసి హరిణి రెడ్డితో త్వరలోనే ఆయన ఏడడుగులు వేయనున్నారు. నిన్న హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. హరిణి నేపథ్యం గురించి తెలియాల్సి ఉంది.

News August 18, 2025

తెనాలిలో గంజాయి ముఠా అరెస్ట్

image

తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న 15 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. తెనాలి 3 టౌన్ పరిధిలోని సుల్తానాబాద్‌లో 8 మందిని అరెస్టు చేసి, వారి నుంచి కిలో 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఒకరు పరారీలో ఉన్నారన్నారు. మరో కేసులో కొల్లిపరలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి కిలో 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

News August 18, 2025

భూముల హద్దుల నిర్ధారణకు… కొత్త సర్వే మాన్యువల్!

image

జిల్లాలో భూముల హద్దులను నిర్ధారించేందుకుగాను కొత్త సర్వే మాన్యువల్ ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గత పదేళ్ల కాలంలో సర్వే విభాగం పూర్తి నిర్లక్ష్యానికి గురైన విషయం తెలిసిందే. ప్రజా పాలనలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే వ్యవస్థకు నూతన హంగులు తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దీంట్లో భాగంగా ఇవాల్టి నుంచి లైసెన్సుడ్ సర్వేలకు రెండో విడత శిక్షణ ఇస్తున్నారు.