News August 18, 2025
సంగారెడ్డి: పర్యావరణ పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నేషనల్ స్టూడెంట్ పర్యావరణ పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈనెల 21 వరకు https://ecomitram.app/nspc/school వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఇతర వివరాలకు జిల్లా ఎన్జీసీ కో ఆర్డినేటర్ మాధవ రెడ్డి 94400 69750 నంబరును సంప్రదించాలని సూచించారు.
Similar News
News August 20, 2025
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

కోనసీమ జిల్లాలో ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరిగే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్‌లో ఎస్పీ, జాయింట్ కలెక్టర్‌తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News August 20, 2025
సిద్దిపేట: మట్టి బతుకుల్లో ‘భరోసా’

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఫొటోగ్రాఫర్‌ల నుంచి ఫొటోలను ఆహ్వానించింది. అందులో సిద్దిపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ సతీశ్‌కు రైతు భరోసా నేపథ్యంలో తీసిన ఫోటో రాష్ట్రస్థాయి బహుమతికి ఎంపికైంది. రాష్ట్రస్థాయి అవార్డుకు ఫొటో ఎంపిక కావడంతో ఫొటోగ్రాఫర్ సతీశ్‌కు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పురస్కారం అందించారు.
News August 20, 2025
కన్నీళ్లు పెట్టిస్తున్న PHOTO

TG: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లే ఆ పిల్లల ఊపిరి తీసింది. HYD శివారు బాచుపల్లిలో తల్లి లక్ష్మి తన ఇద్దరు పిల్లల(ఒకరు 8 నెలలు, మరొకరు మూడేళ్లు)ను నీటి సంపులో పడేసింది. అప్పటివరకు ఆనందంగా ఆడుకున్న ఆ చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను వెలికితీయగా ఆ దృశ్యం చూసినవారిని కంటతడి పెట్టిస్తోంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.