News August 18, 2025
EP-40: వీరితో శత్రుత్వం వద్దు: చాణక్య నీతి

కొంతమందితో ఎప్పటికీ శత్రుత్వం పెంచుకోకూడదని, అది ఖరీదైనదిగా మారుతుందని చాణక్య నీతి చెబుతోంది. ‘మీ పొరుగువారితో సంబంధాలు చెడితే శత్రువులుగా మారుతారు. అత్యంత సన్నిహితులతోనూ శత్రుత్వం వద్దు. మీ రహస్యాలు, బలహీనతలు బయటపడి ముప్పుగా మారవచ్చు. కుటుంబసభ్యులనూ శత్రువులుగా చేసుకోవద్దు. ప్రభావవంతమైన వ్యక్తులతోనూ శత్రుత్వం వద్దు. ఆఫీసులో సహోద్యోగులతో శత్రుత్వం పెంచుకోకూడదు’ అని చెబుతోంది. #<<-se>>#Chanakyaneeti<<>>
Similar News
News August 18, 2025
వర్షాలు ఎక్కువైతే సెలవులు పొడిగిస్తాం: మంత్రి సంధ్యారాణి

AP: వర్షాలు ఎక్కువగా ఉంటే పాఠశాలలకు సెలవులు పొడిగిస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ప్రభుత్వం సమీక్షిస్తోందని తెలిపారు. ఏడాదిలోనే దాదాపు రూ.1,300 కోట్లు రహదారుల అభివృద్ధికే వినియోగించామన్నారు. రాబోయే 3 ఏళ్లలో గిరిజన ప్రాంతాల్లో మెజారిటీ రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
News August 18, 2025
ఈ నెల 22న ‘మెగా157’ మూవీ గ్లింప్స్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా(మెగా157) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరు జన్మదినం సందర్భంగా ఈ నెల 22న మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని డైరెక్టర్ అనిల్ ఓ టీవీ షోలో చెప్పారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
News August 18, 2025
వినాయక చవితి.. ఈ విషయాలు గుర్తుంచుకోండి!

ఆగస్టు 27న గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదలవనున్నాయి. విగ్రహాలు నెలకొల్పేందుకు మండపాలు సిద్ధమవుతున్నాయి. అయితే మండపాల ఏర్పాట్లలో కరెంట్ తీగలు <<17438408>>తగిలే<<>> ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే అత్యవసర సమయాల్లో అంబులెన్స్, పోలీసు వాహనాలు వెళ్లేలా గల్లీల్లో దారి వదిలి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.