News August 18, 2025
EPFOలో 230 ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి. <
Similar News
News August 19, 2025
16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్

AP: మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్ మార్కులపై అభ్యంతరాల స్వీకరణ, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టు రావడంతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో వెరిఫికేషన్‌కు పిలవనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
News August 19, 2025
నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. నేడు ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం.. తెలంగాణలోని ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. కామారెడ్డి(D) మద్నూర్, డోంగ్లీ మండలాలకూ సెలవు ప్రకటించారు. కాగా వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల CMలు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
News August 19, 2025
బెంగళూరులో ‘యాపిల్’ అద్దె రూ.1,000 కోట్లు!

ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ బెంగళూరులో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నట్లు డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ స్టాక్ తెలిపింది. ఇందుకు రూ.31.57 కోట్లు డిపాజిట్ చేసి, నెలకు రూ.6.3 కోట్ల అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఏడాదికి 4.5 శాతం అద్దె పెంపుతో పదేళ్లకు రూ.1,000 కోట్ల రెంట్ చెల్లించనున్నట్లు పేర్కొంది. 13 అంతస్తుల భవనంలో 9 అంతస్తులను 2035 వరకు లీజుకు తీసుకుంది.