News August 18, 2025
స్త్రీనిధి రుణాల మంజూరులో నిజామాబాద్ టాప్

స్త్రీనిధి రుణాల మంజూరు, రికవరీలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024-25లో 2,953 మహిళా సంఘాలలోని 7,386 మంది సభ్యులకు రూ. 63.11 కోట్లు రుణాలు మంజూరు చేశారు. 2025-26లో రూ. 1,228.50 కోట్లు లక్ష్యం కాగా, ఆగస్టు 11 నాటికి 4,300 సంఘాలకు రూ. 357.41 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనితీరు జిల్లాలో మహిళా సాధికారతకు నిదర్శనం.
Similar News
News August 18, 2025
సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని NZBకలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సోమవారం వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
News August 18, 2025
నిజామాబాద్ జిల్లాలో 17,301 ఇందిరమ్మ ఇళ్లు

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా కొనసాగుతోంది. 19,397 ఇళ్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 17,301 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 9,486 ఇళ్లకు మార్కింగ్, 4,820 ఇళ్లకు బేస్మెంట్ పనులు పూర్తయ్యాయి. 742 ఇళ్లు రూఫ్ లెవల్, 237 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు వచ్చాయి. ఈ పనులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 60.36 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
News August 18, 2025
NZB: రుణమాఫీ, రైతు భరోసా, రైతుభీమా నిధులు ఎన్నంటే?

నిజామాబాద్ జిల్లాలో రైతు సంక్షేమ పథకాలు ఊపందుకున్నాయి. రైతు రుణమాఫీ కింద 97,696 మంది రైతుల పంట రుణాలు రూ.755.29 కోట్లు మాఫీ అయ్యాయి. ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద 2,72,589 మంది రైతుల ఖాతాల్లో రూ.316 కోట్లు జమ చేశారు. రైతు బీమా ద్వారా 966 మంది రైతుల కుటుంబాలకు రూ.48.30 కోట్లు అందాయి. ఇలా మొత్తం మీద రైతులకు రూ.1,119 కోట్లకు పైగా ప్రయోజనం లభించింది.