News April 1, 2024

విజయనగరం: డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఆపార్టీ ఈసారి గెలుస్తుందా?

image

విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 1978 నుంచి 2004 మినహా 2009 వరకు పి.అశోక్ గజపతిరాజు TDP నుంచి గెలుపొందారు. ఇక్కడ తొలిసారి 2019లో టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజుపై కోలగట్ల వీరభద్ర స్వామి 6417 ఓట్ల మెజారిటీతో పోటీ చేసి YCP జెండా ఎగురవేశారు. ఈసారి కూడా YCP,TDP నుంచి వీరే బరిలో ఉన్నారు. మరి రానున్న 2024 ఎన్నికలలో 2019 ఫలితాలు రిపీట్ అవుతాయా.. లేదా? ..కామెంట్ చేయండి.

Similar News

News September 29, 2024

కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

కురుపాం మండలం వలసబల్లేరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని నీలకంఠపురం SI తెలిపారు. ఘటనలో బిడ్డిక జూజారు, బిడ్డిక శ్రీను మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News September 29, 2024

100 జిల్లాల్లో విజయనగరానికి స్థానం

image

కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ జ‌న్ జాతీయ ఉన్న‌త్ గ్రామ్ అభియాన్ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి అక్టోబ‌రు 2న ఆన్‌లైన్ వర్చువల్‌గా ప్రారంభించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్ ఆదివారం తెలిపారు. ఆదిమ గిరిజ‌న తెగ‌ల వారు నివ‌సించే దేశంలోని 100 జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. అందులో విజ‌య‌న‌గ‌రం జిల్లా కూడా ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

News September 29, 2024

విజయనగరం జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రాలివే

image

అక్టోబర్ 3 నుంచి 21 వరకు (11, 12 తేదీలు మినహాయించి) జిల్లాలో టెక్ పరీక్ష జరగనుంది. కలువరాయి, చింతలవలస, కొండకారకం, గాజులరేగ, జొన్నాడ కేంద్రాలలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగి మరల 2.30 నుంచి సాయంత్రం 5 వరకు అన్ లైన్ పరీక్ష జరగనుంది.
పరీక్షకు హాజరయ్యేవారు గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు.