News August 18, 2025
కడపపై అనంతపురం సీనియర్ ఉమెన్ జట్టు విజయం

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ సీనియర్ ఉమెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లో కడప జట్టుపై అనంతపురం జట్టు 38 రన్స్ తేడాతో ఆదివారం విజయం సాధించింది. అనంతపురం జట్టు బ్యాటర్స్‌లో అర్షియ 68, నేహా 62 నాట్ ఔట్, బౌలర్లలో దండు చక్రిక, తేజస్విని చెరో 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర వహించారు. విజేతలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ భీమలింగరెడ్డి అభినదించారు.
Similar News
News August 18, 2025
సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: హేమంతరావు

సీపీఐ నాలుగో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు కోరారు. సోమవారం వైరా మండలంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 20 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ఈ మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
News August 18, 2025
భూపాలపల్లి: పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం: కలెక్టర్

సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం పాపన్న 375వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దోపిడీ, భూస్వాముల పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప బహుజన విప్లవకారుడు పాపన్న అని కొనియాడారు. 12 మందితో సైన్యం స్థాపించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన గొప్ప వీరుడని అన్నారు.
News August 18, 2025
కృష్ణా: ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల సంతోషం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోడూరు, అవనిగడ్డ మధ్య నిత్యం ప్రయాణించే మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు ఈ పథకం వల్ల నెలవారీ ఖర్చులు ఆదా అవుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు కార్డు చూపిస్తే కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ ఇస్తున్నారని చెప్పారు. ఈ పథకం మహిళలకు ఆర్థికంగా ఎంతో ఊరట కలిగిస్తుందని వారు అంటున్నారు.